Thu. Nov 21st, 2024

Kannula Ninduga – కన్నుల నిండుగ

Lyrics : Kannula Ninduga

Kannula Ninduga :

Telugu LyricsEnglish LyricsSong DetailsPlay Song

 

కన్నుల నిండుగ – క్రిస్మస్ పండుగ
గుండెల నిండుగ – ఆనందముండుగ (2)
పరమ పురినుండే – పరిశుద్ధ దేవుడు
పుడమిలో పుట్టెగా – పాపుల బ్రోవగ
మహిమలోనుండే – మహిమాత్ముండు
మనుజుడాయెగా – మరణము నొందగా
రండి చేరి కొలిచెదం – రారండి కలసి పాడుదాం
రండి యేసుననుసరించుదాం – పదండి ప్రభుని చూపించుదాం (2)

సర్వసృష్టిని మాటతో చేసిన – సార్వభౌముడా నీకు సముడెవ్వరయ్యా
లోకపాపమంతయూ మోయవచ్చిన – దైవమానవా నీకు స్థలమే లేదయ్యా (2)
చీకటినుండి వెలుగునకు – మరణమునుండి జీవముకు (2)
నడిపింప వచ్చిన నజరేయుని – దాటింప వచ్చిన దయామయుని
ప్రేమించి వచ్చిన ప్రేమామయుని – క్షమియించ వచ్చిన క్షమాపూర్ణుని      ||రండి||

విశ్వమంతయూ వ్యాపించియున్న – సర్వవ్యాపి నీవులేని చోటే లేదయ్యా
అంతరంగమంతయూ ఎరిగియున్న – సర్వజ్ఞాని నీకు సాటే లేరయ్యా (2)
దాస్యము నుండి స్వాతంత్ర్యమును – శాపము నుండి విడుదలను (2)
ప్రకటింప వచ్చిన పుణ్యాత్ముని – రక్షింప వచ్చిన రక్షకుని
శాంతిచేయ వచ్చిన శాంతమూర్తిని – విడిపింప వచ్చిన విమోచకుని      ||రండి||

ఊహకందని త్రియేకమైయున్న – అద్వితీయుడా నీవే ఆత్మరూపివయ్యా
నిన్న నేడు రేపు ఏకరీతిగున్న – నిత్యనివాసి నీకు అంతమే లేదయ్యా (2)
సంకెళ్ళనుండి సంబరానికి – ఉగ్రతనుండి ఉదాత్తతకు (2)
తప్పింప వచ్చిన త్యాగమూర్తిని – కనికరింప వచ్చిన కరుణశీలుని
కృపజూపవచ్చిన కృపాకరుని – దాపుచేరనిచ్చిన దాక్షిణ్యపూర్ణుని      ||రండి||

 

Kannula Ninduga – Christmas Panduga
Gundela Ninduga – Aanandamunduga (2)
Parama Purinunde – Parishuddha Devudu
Pudamilo Puttegaa – Paapula Brovaga
Mahimalo Nunde – Mahimaathmundu
Manujudaayegaa – Maranamu Nondagaa
Randi Cheri Kolichedam – Raarandi Kalai Paadudaam
Randi Yesunanusarinchudaam – Padandi Prabhuni Choopinchudaam (2)

Sarva Srushtini Maatatho Chesina – Saarvabhoumudaa Neeku Samudevvarayyaa
Loka Paapamanthayu Moya Vachchina – Daiva Maanavaa Neeku Sthalame Ledayyaa (2)
Cheekati Nundi Velugunaku Maranamu Nundi Jeevamuku (2)
Nadipimpa Vachchina Najareyuni – Daatimpa Vachchina Dayaamayuni
Preminchi Vacchina Premaamayuni – Kshamiyincha Vachchina Kshamaapoornuni          ||Randi||

Vishwamanthayu Vyaapinchuyunna – Sarva Vyaapi Neevu Leni Chote Ledayyaa
Antharangamanthayu Erigiyunna – Sarva Gnaani Neeku Saate Lerayyaa (2)
Daasyamu Nundi Swaathanthryamunu – Shaapamu Nundi Vidudalanu (2)
Prakatimpa Vachchina Punyaathmuni – Rakshimpa Vachchina Rakshakuni
Shaanthi Cheya Vachchina Shaanthamoorthini – Vidipimpa Vachchina Vimochakuni          ||Randi||

Oohakandani Thriyekamaiyunna – Advitheeyudaa Neeve Aathmaroopivayyaa
Ninna Nedu Repu Ekareethigunna – Nithya Nivaasi Neeku Anthame Ledayyaa (2)
Sankella Nundi Sambaraaniki – Ugratha Nundi Udaatthathaku (2)
Thappimpa Vachchina Thyaagamoorthini – Kanikarimpa Vachchina Karunasheeluni
Krupa Joopa Vachchina Krupaakaruni – Daapu Cheranichchina Daakshinya Poornuni          ||Randi||

 

రచన : సహా. అనిల్ కుమార్ వేముల

సంగీతం : సహా. కే వై రత్నం

గాత్రం : బ్రో.నిస్సి జాన్ , బ్రో .సునీల్ కుమార్ వై, బ్రో .సిద్దు సిస్టర్ .రాజి లేఖన, సిస్టర్.శృతి, సిస్టర్. దీవెన కారల్ , సిస్టర్. మేరీ సౌరభ

The song “Kannula Ninduga – Christmas Panduga” celebrates the birth of Jesus Christ and praises his divine attributes. It describes him as the embodiment of Christmas joy, pure, forgiving, loving, and the protector of humanity. Throughout, the song highlights Jesus’s boundless nature: omnipresent, omniscient, omnipotent, unique, eternal, and the source of peace and salvation. It emphasizes his role as the liberator from slavery and damnation, the sacrifice who brought light and life, and the embodiment of compassion and love. Overall, the song reveres Jesus as the ultimate source of hope and salvation for all mankind.

Kannula Ninduga

 

 

Spread the love

Leave a Reply